Soundarya Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే ఈమె పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇంట్లో తన ఎస్ యువి కారు తాళాలు కనిపించకపోవడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు.
ఈమె ఒక ప్రైవేట్ కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేలోపు తన కారు తాళాలు కనిపించడం లేదు అంటూ సౌందర్య రజనీకాంత్ చెన్నైలోని తేనాం పేట పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మొన్నేమో అక్క ఇంట్లో నేడేమో చెల్లెలు ఇంట్లో దొంగతనాలు జరగడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గత కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు నగలు దొంగతనానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె తన ఇంటి పనిమనిషి అలాగే డ్రైవర్ పై సందేహాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
ఐశ్వర్య రజనీకాంత్ తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ చాలీ చాలని జీతాలు ఇవ్వటం వల్లే తాను దొంగతనానికి పాల్పడ్డానంటూ ఆమె పనిమనిషి ఈశ్వరి పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. ఇలా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగినటువంటి దొంగతనం మర్చిపోకముందే తిరిగి సౌందర్య రజనీకాంత్ ఇంట్లో కూడా దొంగతనం జరగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…