Featured

SP Sailaja : ఎస్.పి.శైలజ ఒకే ఒక చిత్రంలో నటించారు.. కానీ ఈ ఒక్క సీన్ ఆ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపింది.!!

ఎస్.పి.శైలజ మనిషి ఎంత సుమధురమో మనసంత మధురం చీరలో నిండైన తెలుగుదనం గొంతులో మెండైన కోకిల గానం. తెరపై నటులు ఆడే ఆటకు తన పాటతో పల్లవి చరణాలనందించి అదే తెరపై తన గొంతుతో ఆయా పాత్రలకు ప్రాణం పోసింది. సినిమా అవకాశాల కోసం ఏనాడు వెంపర్లాడలేదు. తొమ్మిదో తరగతిలో శైలజ పాటలు విన్న సంగీత దర్శకుడు చక్రవర్తి తను సంగీత దర్శకత్వం వహించే సినిమాలో అవకాశం కల్పించారు. 1977 ప్రాంతంలో తన కెరీర్ ప్రారంభించిన శైలజ ఒకటి తర్వాత మరొకటి అన్నట్టుగా అనేక పాటలు పాడారు. ఒకానొక సందర్భంలో బాలసుబ్రమణ్యం కచేరీకి ఫిమేల్ సింగర్ రాకపోవడంతో శైలజతో పాడించడం జరిగింది. అలా ఎస్.పి శైలజ సినీ గమనం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న క్రమంలో అనుకోకుండా ఆమెకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

“సాగరసంగమం” కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు. ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు. కథానాయికగా ముందుగా జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృత్యం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు.

అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు. శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది.
మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు.. శైలజ నృత్య ప్రదర్శనలో “పంచభూతములు ముఖపంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై.. అనే గాన లాహిరిలో పంచభూతాలు అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అని తెలియకుండా భూతము, దెయ్యం అన్నట్టుగా ఆంగిక ప్రదర్శన జరిగిందని శైలజ గురించి ఓ దినపత్రికలో బాలకృష్ణ(కమల్ హాసన్) రాస్తాడు.. అది చదివిన శైలజ ప్రియుడు.. ఆ దినపత్రిక కార్యాలయం లో బాలకృష్ణను నానా మాటలు అంటూ దూషిస్తాడు… ఆవేశంతో బాలకృష్ణ (కమల్ హాసన్) ఆ పాటకు నృత్యం ఎలా చేయాలో.. భరతనాట్యం, కథక్, కథాకళి నృత్యాలను చేసి ఆమెకు (శైలజ) చూపిస్తాడు.

గత నృత్య ప్రదర్శనలో శైలజ చేసిన తప్పు ఏంటో సంపూర్ణంగా తెలుసుకుంటుంది. ఆ తరువాత నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ(కమల్ హాసన్) మరణించడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో “సలంగై ఒలి” (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago