Categories: FeaturedMovie News

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై సోదరి శైలజ ఒకలా.. తనయుడు చరణ్ మరొకలా పరస్పర విరుద్ధ‌ ప్రకటనలు.. ఆందోళనలో బాలు ఫ్యాన్స్ !!

టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ సోకటంతో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆయనకు ఏమైందోనంటూ ఆందోళన చెందిన బాలు ఫ్యాన్స్ కూడా బాలు వీలైనంత త్వరగా కోలుకోవాలని, బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ దేవుడ్ని ప్రార్థించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా, సింగర్ సునీత వంటి సినీ ప్రముఖులు కూడా బాలు త్వరగా కోలుకోవాలంటూ అంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ”అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. హాస్పిటల్ లోని వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకెంతో ఉపయోగపడింది. నాన్నగారు ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. డాక్టర్లు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. నాన్నగారు నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై డాక్టర్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంటాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు” అని ఓ ఆడియోను విడుదల చేసాడు చరణ్.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన సోదరి ఎస్పీ శైలజ నిన్న ఉదయం అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకీ మెరుగవుతుందని, వెంటిలేటర్ తొలగించారని తెలియజేశారు. బాలు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషించారు. అయితే అదేరోజు సాయంత్రానికి మళ్ళీ ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్.. శైలజ చెప్పినదానికి విరుద్ధంగా.. “హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మా నాన్నగారికి వెంటిలేటర్ తొలగించినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు” అంటూ తెలపడంతో ఈవిధంగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు పరస్పర విరుద్ధ‌మైన ప్రకటనలు చేయడంతో బాలు ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago