Sr.NTR: ఒక హైదరాబాదులోనే కోట్లు విలువ చేస్తే ఆస్తులను కలిగి ఉన్న ఎన్టీఆర్.. ఎన్ని కోట్లో తెలుసా?
Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలనాటి నటుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన మద్రాస్ లో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులను పోగు చేశారు.
ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఈయన సంపాదించినది మొత్తం ఆస్తులను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈయన ఆస్తిపాస్తులు కొన్ని వందల కోట్లు విలువ చేస్తాయని చెప్పాలి. ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా రామకృష్ణ థియేటర్ ప్రారంభించారు. ఈ థియేటర్ ప్రారంభించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన కొనుగోలు చేసి ఏకంగా ఎన్టీఆర్ ఎస్టేట్ అనే పేరు పెట్టారు.
అలాగే ఇందులో ఎన్టీఆర్ ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్టీఆర్ రామకృష్ణ థియేటర్ ప్రారంభించిన తర్వాత ప్రతి జిల్లాలోని ఒక థియేటర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయానికి ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడంతో థియేటర్ నిర్మాణం కుదరలేదు.మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు ఇండిపెండెంట్ బిల్డింగ్స్ కట్టించి తన ఐదుగురు కొడుకులకు ఇచ్చారు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఇంటిని తన పెద్ద కూతురు పేరుపై రాసిన ఈ ఇంటిని ఎన్టీఆర్ అనంతరం లక్ష్మీ పార్వతీ పేరుపై రాశారు. గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కొనుగోలు చేశాడు. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో ఇలా ఎన్టీఆర్ ఎంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు అయితే ఈయన సంపాదించినది మొత్తం 1982 లో తన పిల్లలకు పంపకాలు చేశారు.ఈ విధంగా ఎన్టీఆర్ హైదరాబాదులో కొనుగోలు చేస్తున్న ఆస్తిపాస్తులు కొన్ని వందల కోట్లలో ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…