Sr.NTR: సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొందరి కోసం రాసుకున్న కథలు ఆ హీరో హీరోయిన్లతో కాకుండా కొన్ని అనీవార్య కారణాలవల్ల ఇతరులతో చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా కొన్నిసార్లు కొంతమంది కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి బాధపడిన సందర్భాల్లో ఉన్నాయి మరి కొన్నిసార్లు ఈ సినిమా చేయకపోవడమే మంచిదైందని సంతోషపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ విధంగా సీనియర్ ఎన్టీఆర్ తన సినిమా షెడ్యూల్ కారణంగా కొన్నిసార్లు కాల్ షీట్స్ లేకపోవడంతో ఎంతో అద్భుతమైన సినిమాలను మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇలా మిస్ చేసుకుని బాధపడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏఎన్ఆర్ నటించిన భక్తతుకారం సినిమాలో నటించాల్సిన ఛాన్స్ ముందుగా ఎన్టీఆర్ కి వచ్చిన ఈయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నారట.
ఇకపోతే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో శ్రీకృష్ణ పాండవీయం సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమాను అన్నగారే నిర్మించి ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రావడంతో ఈ సినిమా అతనికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల చేసినప్పటికీ కలెక్షన్లపై భారీ దెబ్బ పడిందని తెలుస్తోంది.
ఈ విధంగా ఈ సినిమా కలెక్షన్ల పైతీవ్రమైన ప్రభావం చూపడంతో ఎన్టీఆర్ ఎంతో మధన పడ్డారని ఏకంగా రెండు నెలల పాటు ఈ సినిమా గురించి తనలో తానే మదనపడుతూ బాధపడ్డారని తెలుస్తోంది. ఇక ఈయన పౌరాణిక చిత్రాలు కాకుండా సాంఘిక సినిమాలలో నటించడం కోసం ఎన్టీఆర్ గారికి తన పొట్ట ఒక సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలోనే చాలామంది తన పొట్టను తగ్గించుకోవాలని సూచించారట. అయితే ఉదయం షూటింగ్ కి వెళ్లి రాత్రి రావడంతో ఆయనకు ఎక్సర్సైజ్ చేసే తీరిక లేక కొన్ని బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…