Featured

Sree Lakshmi : ఇద్దరు పిల్లలు చనిపోయారు… వాడి జీవితం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు : శ్రీ లక్ష్మి

Sree Lakshmi : సీనియర్ నటి, కమెడియన్ శ్రీలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె కొన్నివందల సినిమాల్లో నటించారు. శ్రీ లక్ష్మి గారి తండ్రి అమర్నాథ్ గారు తెలుగులో హీరోగా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను చేశారు. ఇక శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ కూడా నటుడే. తెలుగు సినిమాల్లో చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో గా అలాగే విలన్ గా పాత్రలు చేసిన రాజేష్ గారు చాలా చిన్న వయసులో మరణించారు. ఇక ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక రాజేష్ గారి మరణం గురించి శ్రీలక్ష్మి గారు తాజాగా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.

అలా చనిపోతాడని కలలో కూడా అనుకోలేదు…

రాజేష్ చిన్న వయసులోనే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ శ్రీ లక్ష్మి గారు అభిప్రాయపడ్డారు. మా నాన్న ఆరోగ్యం బాగోలేక ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాల్లో ఉన్న అవకాశాలను కూడా వదలకుండా సినిమాలను చేసాను. ఇక అలా రాజేష్ నేను సినిమాలను చేస్తున్న సమయంలో తండ్రి మరణించాక కొద్దిరోజులకే రాజేష్ పెళ్లి చేసుకోవాలానే నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి ఈ వయసుకే పెళ్లి ఎందుకు ఇంకా ఆడపిల్లలం మేమే పెళ్లి చేసుకోలేదు అని అన్నా వినలేదు అంటూ శ్రీలక్ష్మి గారు బాధపడ్డారు. ఇక పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాడు ముప్పై ఏడేళ్లు దాటేసరికి నలుగురు పిల్లలు కుటుంబం బాధ్యతలతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పని బాధపడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తాగి చిన్న వయసులో ముప్పై ఎనిమిదేళ్ళకే మరణించాడు. అంత చిన్న వయసుకే తప్పుడు నిర్ణయాల వల్ల మరణించాడు.

ఇక పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఇరవై ఏళ్ళు వచ్చాక మరణించారు. ఒకడు ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడని ఫోన్ చేసి ఆ అమ్మాయి కుటుంబం చెప్పారు. వెళ్లే సరికి హాస్పిటల్ లో శవం ఉంది, ఏం జరిగిందో ఎలా చనిపోయాడో ఇప్పటికీ తెలీదు. ఇక ఇంకొకడు అచ్చం రాజేష్ లాగా ఉండేవాడు వాడు ఆక్సిడెంట్ లో డివైడర్ కొట్టి చనిపోయాడు. అలా రాజేష్ ఇద్దరు పిల్లలు పెద్దయ్యాక మరణించారు అంటూ శ్రీ లక్ష్మి చెప్పారు. ఇక కూతురు ఐశ్వర్య మాత్రం ప్రస్తుతం తమిళ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Bhargavi

Recent Posts

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త MPVలు… కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్స్..

ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…

8 minutes ago

అమెజాన్‌లో Galaxy S24 – భారీ తగ్గింపు, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకోండి

కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…

52 minutes ago

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

11 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

11 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

11 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

12 hours ago