Featured

Sree Reddy : మా ఇంటికి వస్తావా…. మీ ఇంటికి నన్ను రమ్మంటావా… మహాసేన రాజేష్ గురించి హాట్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి…!

Sree Reddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు సినిమాల్లో కనిపించకపోయిన సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. చాలా రోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీ లోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది.అయితే ఇటీవలే చాలా రోజుల గ్యాప్ తరువాత తెలుగు మీడియాలో మళ్ళీ మాట్లాడింది శ్రీ రెడ్డి.

మహాసేన రాజేష్ మీద హాట్ కామెంట్స్….

శ్రీరెడ్డి వైసీపీ తరుపున మౌత్ పీస్ లాగా మాట్లాడుతూ ఎవరైనా జగన్ ను వైసీపీ ని కామెంట్స్ చేస్తే వారిని ఏకి పరిస్తూ ఉంటుంది. అలాంటి శ్రీరెడ్డి తాజాగా టీడీపీ లో చేరిన మహాసేన రాజేష్ గురించి పాజిటివ్ గా మాట్లాడింది. ఆశ్చర్యంగా ఉన్న అప్పటి వరకు విమర్శలతో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి ఒక్కసారిగా మహాసేన రాజేష్ ను ఇంటికి రమ్మని పిలిచింది. మహాసేన రాజేష్ తన గురించి మాట్లాడిన తీరు నచ్చిందంటూ శ్రీ రెడ్డి చెప్పడం విశేషం.

విమర్శించాలనుకున్న నా నోటిని కట్టేసాడు మహాసేన రాజేష్ మా మధ్య పార్టీ పరంగా బేధభిప్రాయాలూ ఉండవచ్చు కానీ నేను అతను మాట్లాడిన దానికి ఫిదా అయ్యాను. అతనిని అతని కుటుంబాన్ని మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తు న్నాను అంటూ మా ఇంటికి రండి అంటూ పిలిచింది. కులం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకపోతే మంచిదంటూ కోంతమందికి సూచించింది శ్రీ రెడ్డి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago