Sree Sathya : విజయవాడకి చెందిన మంగళంపల్లి శ్రీ సత్య మోడలింగ్, అలాగే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు నాట జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘త్రినయని’ సీరియల్ తో బుల్లి తెర అభిమానులకు దగ్గరైన శ్రీ సత్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక బిగ్ బాస్ లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవగా కొంతమంది ఆటిట్యూడ్ చూపిస్తుంది అంటూ శ్రీ సత్య పేరును నామినేట్ చేసారు. దీంతో శ్రీ సత్య తన గతం గురించిన విషయాలు చెప్పింది.
పదే పదే మోసం చేసానని చెప్పుకుంటోంది…
శ్రీ సత్య ను ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఆటిట్యూడ్ చూపిస్తోంది, ఎవరితో సరిగా మాట్లాడదు అంటూ నామినేట్ చేసారు కొంతమంది ఇంటి సభ్యులు. ఇక నామినేషన్ ప్రక్రియలో తాను అందరితో ఎందుకు మాట్లాడటం లేదో తన గతం గురించి చెప్పింది శ్రీ సత్య. తాను 19 ఏళ్లకే ఒకరితో ప్రేమలో ఉన్నానని పవన్ రెడ్డి తో నిశ్చితార్థం జరిగాక, పవన్ నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక పోయానని ఆ షాక్ వల్లే మా అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పింది.
ఆ సంఘటనతో పెళ్లి ఇక చేసుకొనని ఇంట్లో చెప్పేశానని చెప్పి ఎమోషనల్ అయింది శ్రీ సత్య. అయితే ఇదంతా శ్రీ సత్య వెర్షన్. ఇక ఇప్పుడు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కూడా తానేమి సత్యని మోసం చేయలేదంటూ ఒక వీడియో విడుదల చేసాడు. మోసం చేసే అలోచన ఉంటే పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ అడుగుతున్నాడు పవన్ రెడ్డి. పదే పదే నేను ఏదో మోసం చేసాను అంటూ చెప్పుకుంటోంది వాస్తవం అది కాదు అంటూ చెప్పాడు. అసలు ఎవరు చెప్పేది నిజమో జనాలకు మాత్రం క్లారిటీ రాలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…