Featured

Senior journalist Bhardwaja : 1993 నవంబర్ 15 అనగానే టాలీవుడ్ ఉలిక్కిపడుతుంది… చిరంజీవి ఏడుస్తుంటే… బాలకృష్ణ ఏం చేశారంటే : భరద్వాజ

Senior journalist Bhardwaja : మద్రాస్ నుండి హైదరాబాద్ కు టాలీవుడ్ తరలింపు 1990 లో మొదలైంది. మొదటగా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు హైదరాబాద్ కు వచ్చేసారు. ఇక సినిమా స్టూడియోల నిర్మాణం హైదరాబాద్ లో మొదలయింది. అయితే పూర్తి స్థాయి తరలింపు 1993 ఆ ప్రాంతంలో జరిగింది. అయితే మద్రాస్ నుండి హైదరాబాద్ ఒకేసారి 200 మందికి పైగా ఆర్టిస్టులు విమాన మార్గం ద్వారా బయలుదేరారు. అయితే ఆ విమానం ప్రమాదానికి గురైతే అందులో ఉన్న ఆర్టిస్టులంతా ఒక్కసారిగా ప్రాణభయంతో గుండెలు అరచేత పట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికీ ఆ రోజును గుర్తు చేస్తే టాలీవుడ్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు.

చిరంజీవి ఏడ్చేశారు… బాలయ్య ఆ పని చేశారు…

మద్రాస్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఆనాడు చిరంజీవి, ఆయన కూతురు శ్రీజ, బాలకృష్ణ ఆయన కుటుంబం, అల్లు రామలింగయ్య గారు, బ్రహ్మానందం, విజయ శాంతి వంటి దిగ్గజ నటులు మొదలు దాదాపు 250 మంది వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఇందన సమస్య రావడంతో ఫైట్ ను ఫారెస్ట్ లో ల్యాండ్ చేసాడు పైలట్ కానీ విమానం కూలిపోతుంది అనే భయంలో చాలా మంది ఏడ్చేశారు. ఇక విమానంను పైలట్ భల్ల ఫారెస్ట్ లో ల్యాండ్ చేసి అందరినీ సేవ్ చేసాడు. ఇక అందరూ అక్కడ దిగాక చిరంజీవి గారు అల్లు రామలింగయ్య ను హత్తుకుని ఒక్క సారిగా ఏడ్చేసారట. అయితే బాలకృష్ణ మాత్రం అక్కడ దిగుతున్న ఆర్థిస్టులకు దిగడానికి సహాయం చేస్తూ చంటి పిల్లలను దించుకుంటూ సహాయం చేశారు.

ఇక ఈ విషయంలో గురించి భరద్వాజ గారు ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి గారు ఎమోషన్ ని దాచలేక పోయారు. అయితే ఈ విషయాన్ని అప్పటి కొంతమంది మంది చిరంజీవి చాలా బేలా మనిషి పిరికివాడు అంటూ చిత్రికరించారు. కానీ అది తప్పు ఒక ప్రమాదం నుండి బయటపడి మళ్ళీ పునర్జన్మ లాగా భావిస్తున్నపుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎదురుపడితే ఏడ్చకుండా ఉండగలమా అదే ఆయన చేసారు. ఇక బాలకృష్ణ ఆ ఎమోషన్ ను పని వైపుకు మళ్ళించారు. అందరినీ ఫ్లైట్ నుండి దించడానికి అక్కడున్న సిబ్బందికి సహాయం చేసి ఆ సిట్యుయేషన్ ను హ్యాండిల్ చేసారు. అది జరిగిన మరుసటి రోజున పైలట్ భల్ల కి సన్మానం చేసారు చిరంజీవి, బాలకృష్ణ గారు. అయితే వివిధ కారణాలతో భల్ల ను సస్పెండ్ చేశారు ఆయన పై అధికారులు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago