న్యాయం కావాలి సినిమా తర్వాత చిరంజీవి ఏ .కోదండరాం రెడ్డి దర్శకత్వంలో మరొక చిత్రం విడుదలైంది. 1981 ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “కిరాయి రౌడీలు ‘సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మోహన్ బాబు, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు.
శివుడు (ప్రభాకరరెడ్డి), బాబూరావు(రావు గోపాలరావు), చలపతి(జగ్గారావు ప్రాణస్నేహితులు బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి (మోహన్ బాబు), శివుడి కొడుకు రాజా (చిరంజీవి) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి (రాధిక) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథాంశము.
“కిరాయి కోటిగాడు”1983, మార్చి 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్. నాగలింగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ సినిమా కథను గమనిస్తే…
ఇద్దరు భూస్వాముల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. గ్రామంలో ప్రజలను దోపిడి చేయడానికి కోటిగాడు అనే వ్యక్తి వారికి సహకరిస్తుంటాడు. గ్రామంలోకి వచ్చిన సైనిక అధికారి రాంబాబు వారికి ఎదురు తిరుగుతాడు. దాంతో గ్రామంలో గొడవలు జరుగుతాయి. గౌరీ అనే గ్రామ అమ్మాయి కోటిగాడిని మంచి వైపు మళ్ళించడంతో అతను భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. సినిమా అనేక మలుపులు తిరిగి చివరికి ముగుస్తుంది.
ఈ చిత్రం 1983, మార్చి 17న విడుదలైంది. ఈ చిత్రం హైదరాబాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని దేవి థియేటర్ లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
కృష్ణ పోషించిన కథానాయకుడు కోటిగాడు ఎంట్రీ సీన్ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించినందుకు దర్శకుడు కృష్ణతో కలిసి “రామరాజ్యంలో భీమరాజు” అనే మరో చిత్రం రూపొందించాడు. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి నటించిన “కిరాయి రౌడీలు” హిట్ చిత్రంగా నిలవగా “కిరాయి కోటిగాడు” సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…