తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంట్లోకి పంపించి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా హౌస్ మేట్స్ ను మరొకసారి సర్ ప్రైజ్ చేయడానికి మళ్లీ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను మరొకసారి స్టేజ్ పైకి పిలిపించారు. దీనితో హౌస్ మెట్స్ మరొకసారి ఫుల్ ఖుషి అయ్యారు.అయితే హౌస్ మెట్ వాళ్లకు కావాల్సిన వాళ్ళు స్టేజి పైకి రావాలి అంటే వారికి ఎంతో ఇష్టమైన వస్తువును సాక్రిఫైస్ చేయాలి అనే ట్విస్ట్ పెట్టాడు నాగార్జున.
దీంతో హౌస్ మేట్స్ కూడా అందుకు ఓకే అన్నారు. ఈ క్రమంలోనే సిరి తనకు కాబోయే భర్త శ్రీహన్ కానుకగా ఇచ్చిన బ్రాస్లెట్ ను త్యాగం చేసింది. అనంతరం నాగార్జున శ్రీహాన్ ను స్టేజిపైకి పిలిపించడంతో శ్రీహన్ ను చూసి ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది సిరి. చాలా రోజుల తర్వాత శ్రీహాన్ కనిపించడంతో కనీసం అతన్ని తలెత్తి కూడా చూడలేకపోయింది. శ్రీహన్ కూడా ఎమోషనల్ అయ్యాడు.
సరదాగా శ్రీహాన్ నన్ను వదిలేస్తావా అనగా… వెంటనే తిరిగి గుంజీలు తీసింది. అది చూసిన ఆమె ప్రియుడు తట్టుకోలేక,నువ్వు తప్పు చేయలేదు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ తిరిగి సిరి ముఖంలో చిరునవ్వు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె బాత్రూంలో తల బాదుకుని సీన్ రిపీట్ చేస్తూ ఎందుకు బాత్రూం గోడలు పగల కొడుతున్నావు అని సరదాగా ఏడిపించాడు.
అనంతరం 8మంది కంటెస్టెంట్ లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారో చెప్పాలి అని శ్రీహాన్ ని నాగ్ ప్రశ్నించగా.. సన్నీ టాప్ వన్ లో, షణ్ముఖ్ ని రెండవ స్థానంలో ఉంచాడు. రవీని మూడవ స్థానంలో, శ్రీరామ్ నాలుగు స్థానంలో ఉంచాడు. అనంతరం శ్రీహాన్ తాను ఒకరిని ప్రేమిస్తున్నానని, రెండు రోజుల క్రితమే ప్రపోస్ చేశాను మెసేజ్ కూడా పెట్టాను అంటూ సిరి గుండెల్లో గుబులు లేపాడు. ఆ ప్రపోజల్ కు థాంక్యూ శ్రీహన్ మామ అని రవి కూతురు రిప్లై ఇచ్చింది అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. చివరగా సిరిని సేవ్ చేసి వెళ్ళాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…