Sreeja: మెగా డాటర్ శ్రీజ పరిచయం అవసరం లేని పేరు ఈమె మెగా కుటుంబంలో జన్మించి మెగా కుటుంబ పరువు తీస్తుందని అభిమానులు ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు. ఈమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇద్దరి భర్తలతో విడాకులు తీసుకోవడంతో శ్రీజ కారణంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరు పరువు పోతుందని మెగా అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటారు.
ఇక శ్రీజ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పిల్లల పెంపకం గురించి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా పిల్లల పెంపకం గురించి శ్రీజ మాట్లాడుతూ.. తన పిల్లలు తన మాట విని తను చెప్పిన మార్గంలోనే వెళ్లాల్సిన పనిలేదని ఈమె తెలిపారు.వారికి ఇష్టమైన దారిలో వారిని వెల్లనిస్తానని అయితే పిల్లలు ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటే వారి గురించి మనం ఆలోచించాల్సిన పనిలేదని తెలిపారు. ఇక తన చిన్న కుమార్తె నవిష్క చాలా అల్లరి పిల్ల అని.. నివృత్తి మాత్రం చాలా సైలెంట్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక పిల్లలను ఎప్పుడైతే మనం గారాబం చేస్తామో అప్పుడే వాళ్ళు చెడిపోతారని.. అందుకే వారిని ప్రతి విషయంలోనూ గారాభం చేయకుండా ఎక్కడ గారాబం చేయాలో ఎక్కడ బెట్టు చేయాలో తనకు బాగా తెలుసు అనేలా ఈమె చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రి తమను ఎంతో గారాబంగా చేసిన క్రమశిక్షణలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఇలా పిల్లల పెంపకం గురించి శ్రీజ చెప్పడంతో పెంపకం గురించి నువ్వే చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…