Sreekanth:తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన పలువురు స్టార్ హీరోల సినిమాలలో అన్నయ్య పాత్రలలోనూ బాబాయ్ పాత్రలలోనూ అలాగే విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇకపోతే తాజాగా రామ్ పోతినేని శ్రీ లీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం స్కంద ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తమన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తాను తమన్ గురించి కచ్చితంగా మాట్లాడాలని ఆయన ఎంతో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిపారు. ఇక ఆయన అఖండ సినిమాకు ఎలాంటి సంగీతం అందించారో మనకు తెలిసిందే. ఇక ఆయన క్రికెట్ ఆడేటప్పుడు సిక్స్ లు కొడుతూ ఉంటే ప్రేక్షకుల నుంచి విజిల్స్ చప్పల్స్ వస్తాయి అంటూ మాట్లాడారు. అయితే చెప్పట్లు అనబోయి పొరపాటున చెప్పల్స్ అని మాట్లాడారు.
ఈ విధంగా తాను పొరపాటుగా మాట్లాడాను అనే విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకాంత్ వెంటనే చప్పట్లు అంటూ కవర్ చేసారు ఇలా తమన్ గురించి శ్రీకాంత్ టంగ్ స్లిప్ అవడంతో ఇందుకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో… అదేంటి బ్రో తమన్ ను అలా అవమానించారంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…