Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.
ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని నాగార్జున కూడా తెలియజేశారు.
ఇకపోతే తాజాగా ఈ షో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి రెండు వేర్వేరు హౌస్లు ఉంటాయట. ఒకే షోలో రెండు ఇళ్లు అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడగొట్టి రెండు ఇళ్లలోకి పంపుతారట అయితే వీరి ప్రవర్తన వీరు గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే విధానం బట్టి వీరిని హౌస్ మారుస్తూ ఉంటారని తెలుస్తోంది.
ఇలా సరికొత్త ఆలోచనలతో ఈ విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇలా ప్రతివారం కంటెస్టెంట్లు హౌసులు మారడంతో ప్రేక్షకులలో కూడా ఎక్సైట్మెంట్ ఉంటుందని తప్పకుండా ఈ కార్యక్రమానికి కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఈసారి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ నిజమే అయితే ఇది సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…