Akhanda Sequel: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. అలాంటిది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేవు.
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చివరిగా వచ్చిన చిత్రం అఖండ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిన మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలు పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించారు.
తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి స్కంద సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ ప్రస్తుతం తాను స్కంద హడావిడిలో ఉన్నానని ఈ హడావిడి కాస్త పూర్తి కాగానే అఖండ సినిమా పనులు మొదలవుతాయని తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్లానింగ్స్ జరుగుతున్నాయని త్వరలోనే వీటన్నింటిని అధికారికంగా తెలియజేస్తామని బోయపాటి తెలిపారు.ఇలా బోయపాటి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నటువంటి బాలయ్య అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…