Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారని రష్మిక ముందుగానే జోస్యం చెప్పారట.
ఇలా అల్లు అర్జున్ ఈసినిమాలో ఎంతో కష్టపడి నటించారు అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కష్టం గురించి రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు మాత్రమే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయి అని చెప్పారట ఈ సినిమాలో ఆయన ఎంతో కష్టపడ్డారని కేవలం మేకప్ కోసమే మూడు గంటల పాటు వెయిట్ చేసేవారని రష్మిక తెలిపారు.
ఇలా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినటువంటి అల్లు అర్జున్ కు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని, ఆయనకు కనుక అవార్డు రాకపోతే బాధపడే మొదటి వ్యక్తిని తానేను అంటూ అప్పట్లోనే రష్మిక అల్లు అర్జున్ నటనకు తప్పనిసరిగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ రష్మిక చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రష్మిక ఆరోజు చెప్పిన విధంగానే అల్లు అర్జున్ కొన్ని నేషనల్ అవార్డు రావడంతో ఈమె చెప్పిన జోస్యం నిజమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో నటించారు. ఇక రష్మిక అల్లు అర్జున్ ఈ సినిమాలో జోడిగా నటించడమే కాకుండా వీరిద్దరూ డి గ్లామర్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…