Bigg Boss: షో ఒక్కటే… హౌస్ లు రెండు బిగ్ బాస్ సీజన్ ఈసారి మామూలుగా ప్లాన్ చేయలేదుగా?

0
49

Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.

ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని నాగార్జున కూడా తెలియజేశారు.

ఇకపోతే తాజాగా ఈ షో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి రెండు వేర్వేరు హౌస్లు ఉంటాయట. ఒకే షోలో రెండు ఇళ్లు అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడగొట్టి రెండు ఇళ్లలోకి పంపుతారట అయితే వీరి ప్రవర్తన వీరు గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే విధానం బట్టి వీరిని హౌస్ మారుస్తూ ఉంటారని తెలుస్తోంది.

Bigg Boss: కొత్త ప్లాన్ సక్సెస్ అయ్యేనా…


ఇలా సరికొత్త ఆలోచనలతో ఈ విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇలా ప్రతివారం కంటెస్టెంట్లు హౌసులు మారడంతో ప్రేక్షకులలో కూడా ఎక్సైట్మెంట్ ఉంటుందని తప్పకుండా ఈ కార్యక్రమానికి కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఈసారి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ నిజమే అయితే ఇది సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.