Sreeleela: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమె నటనతో అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఈమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో శ్రీ లీల నటనకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరి సరసన సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆరేడు సినిమాల షూటింగ్ పనులలో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి శ్రీ లకు ఫేవరెట్ హీరో ఎవరు అనే సందేహం అందరికీ కలిగింది.
మరి శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ఫేవరెట్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటుడు సూర్య.సూర్య తన అభిమాన హీరో అని ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలని ఈమె ఆశపడుతున్నారట. ఇలా ఇంతమంది హీరోలతో నటిస్తున్న ఈమెకు సూర్య తన ఫేవరెట్ హీరో కావడానికి కారణం ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చడమే కాకుండా ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు కారణమని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…