Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో హీరోయిన్ గా పాపులర్ అయిన వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా శ్రీలీలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు వరుస క్యూ కట్టాయి.
రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో నటించి మరొక హిట్ అందుకున్న శ్రీ లీల చేతిలో ప్రస్తుతం 12 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా కన్నడ భాషలో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీ లీల గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. రానున్న ఐదేళ్లలో శ్రీ లీల ఇండస్ట్రీకి దూరం కాబోతోందని, ఆమె జాతకంలో ఉన్న దోషాలే అందుకు కారణమని వార్తలు వైరల్ అవుతున్నాయి.
శ్రీ లీల జాతకం ప్రకారం ఆమెకు సినిమా ఇండస్ట్రీ అచ్చిరాదని తెలిసినప్పటికీ సినిమాల మీద ఉన్న మక్కువతో ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిందని తెలుస్తోంది. ఆమె జాతకంలో ఉన్న దోషాలు ప్రకారం జరిగితే సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల దీపం ఆరిపోవడం పక్క అని అంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోతున్న శ్రీలీలత్వరలోనే ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారని తెలుస్తుంది.
జాతక దోషం కారణంగా రానున్న ఐదేళ్లలో ఆమెకి అవకాశాలు తగ్గి హీరోయిన్ గా ఫెడౌట్ అయ్యి ఇండస్ట్రీ కి దూరమవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు ఇవన్నీ కేవలం పుకార్లేనని ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఇక ఈ వార్తలపై ఈ యంగ్ బ్యూటీ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం తెలుగులో ఈమె బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…