Movie News

Samyuktha Menon: విరూపాక్ష హిట్… భారీగా రెమ్యునరేషన్ పెంచిన నటి సంయుక్త !

Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్త తెలుగులో నటించిన మొదటి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించి హిట్ కొట్టింది.

ఇక ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా ద్వారా కూడా సంయుక్త అకౌంట్లో మరొక హిట్ వచ్చి చేరింది. ఇలా వరుసహిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి టాలీవుడ్లో అవకాశాలు వరుస కడుతున్నాయి.
ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న సంయుక్త.. ఇప్పుడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.

విరూపాక్ష సినిమా హిట్ కొట్టడంతో ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు ఏకంగా కోటన్నర రూపాయిల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అమ్మడు ఒక్కసారిగా కోటి రూపాయలు పెంచడంతో నిర్మాతలు ఈమె ఉంటే సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు కనుక ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదని తెలుస్తుంది.

Samyuktha Menon: మరోసారి కళ్యాణ్ రామ్ కి జోడీగా…

ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ సరసనలో నటించి హిట్ అందుకున్న సంయుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి మరొకసారి జోడి కట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘ డెవిల్ ‘ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. అంతే కాకుండా విరూపాక్ష సినిమా మంచి హిట్ అందుకోవటంతో ఈ సినిమాతోపాటు మరికొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago