Sreemukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో శ్రీముఖి కూడా ఒకరు. శ్రీముఖి తన అందంతో చిలిపి చేష్టలతో యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇలా ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న శ్రీముఖి ప్రస్తుతం వరుస టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ దూకుడు కొనసాగిస్తుంది. అంతేకాకుండా మరొకవైపు సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ నటిగా కూడా నిరూపించుకుంటుంది.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉండగా యాంకర్ గా పాపులర్ అయిన శ్రీముఖి పెళ్లి గురించి తరచు వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే అమ్మడు తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని మండిపడింది. సమయం వచ్చినప్పుడు తానే తన పెళ్లి గురించి అందరికీ తెలియజేస్తానని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఈ యాంకరమ్మ పెళ్లి వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా పెళ్లికూతురు గెటప్ లో ఉన్న శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోంది అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలా పెళ్లికూతురు గెటప్ లో ఉన్నటువంటి శ్రీముఖి ఫోటోలు వైరల్ గా మారడంతో శ్రీముఖి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందా అందుకే ఇలా ఈ ఫోటోలతో హిట్ ఇస్తుందా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఏదైనా షో కోసం శ్రీముఖి ఇలా తయారయ్యారా అంటూ కామెంట్లో చేస్తున్నారు.
ఇలా శ్రీముఖి పెళ్లి గెటప్ గురించి వస్తున్న ఈ వార్తలపై యాంకరమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గా శ్రీముఖి సందడి ఎక్కువగా ఉంది. ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. శ్రీముఖి తన యాంకరింగ్ తో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాలతో చేసే రచ్చ అంతా అంతా కాదు. ఇలా శ్రీముఖి తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రోజురోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…