NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది, ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిందంటే హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ గన్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని అశపడేలా..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతే కాకుండా ఆ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. దీంతో మన భారతీయ సినీ ప్రముఖులతో పాటు హాలీవుడ్ దర్శకులు సైతం వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్ బర్గ్ కూడా పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ, వాల్యూమ్ 3 డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా మన హీరోలపై గతంలో ప్రశంసలు కురిపించారు.
తాజాగా జేమ్స్ గన్ మరోసారి ఎన్టీఆర్ ను గుర్తు చేశారు.గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా జేమ్స్ గన్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యులో గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతే కాకుండా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు…‘గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?’.. అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జేమ్స్ గన్ స్పందిస్తూ.. వెంటనే తారక్ అని బదులిచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బోనులోంచి పులులతో పాటు బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…