Sreeleela: వెండితెరకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం అరుడజనుకు పైగా సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఒకరు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే బోయపాటి రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి శ్రీ లీల సరదాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు.
తాను ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే వచ్చాను అయితే తనకు మంచి పాత్రలలో నటించే అవకాశాలు రావాలని మాత్రమే తన కోరుకుంటాను గానీ సినిమా మొత్తం తనపైనే ఆధారపడి ఉండాలని అసలు అనుకోనని తెలియజేశారు. ఇక ఇంట్లో ఖాళీ సమయంలో తనకు ఏమాత్రం పాలు పోదని తనకు ఇంట్లో ఉండటం కన్నా షూటింగ్ లొకేషన్లో ఉండడమే చాలా ఇష్టమని శ్రీ లీల తెలిపారు.తాను ఎప్పుడు కెమెరా ముందు ఉండడమే తనకు ఇష్టం అదే తనకు ఒక వ్యసనంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా సినిమాలపై ఈమెకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…