Actress Sangeetha:ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎంతో అమాయకంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి నటి సంగీత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి సంగీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంగీత తల్లి భానుమతి మహిళా పోలీస్ కమిషన్ ను ఆశ్రయించి సంగీత పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమె తన తల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సి వచ్చింది. సంగీత తన భర్తతో కలిసి ఓ అపార్ట్మెంట్లో పై అంతస్తులో నివసిస్తున్నారు. అయితే కింద అపార్ట్మెంట్లో తన తల్లి తన పెద్ద సోదరుడితో కలిసి నివసిస్తున్నారు. ఇక సంగీత తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
తన సోదరుడు మరణించడంతో సంగీత తన తల్లిని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పినట్టు ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన తల్లి చేసిన ఈ వ్యాఖ్యలపై సంగీత స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.తాను నివసిస్తున్న ఇల్లు సినిమాలలో సంపాదించి తన కష్టార్జితంతో కట్టుకున్నదని తెలిపారు. తానే తన తల్లి సోదరులను ఆ ఇంట్లో ఉండనిచ్చానని అయితే తన సోదరుడు మరణించిన తర్వాత ఆ ఇల్లు వారి సొంతం చేసుకొని నన్ను రోడ్డుపాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
మా అమ్మ నాకు ఇష్టం లేకపోయినా 13 సంవత్సరాల వయసుకే నన్ను ఇండస్ట్రీలోకి పంపించారని తెలిపారు. తమ్ముడు అన్న బాగా తాగుడుకు బానిసలు అయ్యారని, వారిద్దరూ నన్ను ఒక ఏటీఎం మిషన్ల వాడుకున్నారని ఇప్పుడు తన ఇంటిని కూడా లాక్కొని తనని రోడ్డుపాలు చేయాలని చూస్తున్నారని ఇలాంటి తల్లి మగవారికి కూడా ఉండకూడదు అని అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా తన తల్లి గురించి సంగీత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…