Sri Reddy: ఒకప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా అవి తీవ్ర స్థాయిలో వివాదాలకు కారణం అయ్యేవి. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి వివాదాలకు కాస్త దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమె జీవితం అంటే ఏంటో తెలుసుకుని ప్రస్తుతం తన జీవితాన్ని తాను ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్ళిపోయిన శ్రీ రెడ్డి అక్కడతెలుగు తమిళ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎన్నో రకాల వంట వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున ఆమె అభిమానులను సంపాదించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. ఇకపోతే శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంటలను తయారు చేసి చూపించారు. అయితే తాజాగా ఈమె తెలంగాణ స్టైల్ లో బోటి కూర ద్వార అభిమానుల ముందుకు వచ్చారు.
అయితే ఈ బోటీ కూర చేస్తున్న నేపథ్యంలో ఈమె జీవితం గురించి కొన్ని విలువైన గుణ పాఠాలు చెప్పారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ గతంలో ప్రేమ వివాహం అంటే అబ్బాయికి అమ్మాయి పై ఎంతో ప్రేమ ఉండేది ఇలా అప్పట్లో ప్రేమ వివాహాలు ఎంతో సఫలమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రేమ వివాహాలలో ప్రేమ లేదు. కేవలం అబ్బాయిలు దానికోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారని ఆ మోజు తీరాక వాళ్లు తనను నమ్మి వచ్చిన వారికి అన్యాయం చేస్తున్నారంటూ ఈమె తెలిపారు.
ఈ క్రమంలోనే హైదరాబాదులో తాను చూసిన ఓ సంఘటన గురించి ఈమె తెలిపారు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి కాకుండానే గర్భం చేశారు . అయితే అప్పటికి అమ్మాయిని నమ్మించి గర్భం తొలగించాలని ప్రయత్నం చేయగా గర్భం తీసేస్తే తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసింది. ఇలా తను పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో ఆ అమ్మాయిని తల్లిదండ్రులు బయటకు గెంటేశారు. ఇక ఆ అబ్బాయి కూడా తనని మోసం చేసి వెళ్ళిపోయాడు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుత కాలంలో ప్రేమ అంటేనే నమ్మకం లేదని అందుకే అమ్మాయిలు మీకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు మీ తల్లిదండ్రులని అబ్బాయిని వెతకమని చెప్పండి మీ కాళ్ళపై మీరు నిలబడండి. మీ లక్ష్యాలను మీరు చేరుకోండి అంతేకానీ తొందరపడి ఒకరిని నమ్మి మోసపోవద్దు అంటూ జీవితం గురించి గొప్పగా చెప్పారు. అయితే అందరూ అబ్బాయిలు ఇలాగే ఉన్నారని కాదు కొందరు ఉన్నారు అందుకే తాను ప్రేమ వివాహాలకు పూర్తిగా వ్యతిరేకమంటూ శ్రీ రెడ్డి ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…