Srikanth chari Mother Sankaramma : నేటితరం తాము ప్రత్యక్షంగా చూసిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆంధ్ర పాలకుల నుండి స్వయంపాలన కావాలంటూ, మా తెలంగాణకు న్యాయం జరగాలంటూ అభివృద్ధిని కాంక్షిస్తూ పల్లెలు పట్టణాలు ఏకమై ఒకే తాటి మీదకు వచ్చి జై తెలంగాణ అంటూ చేసిన ఉద్యమం. ఎందరో విద్యావేత్తల మార్గదర్శకాల్లో ఎందరో విద్యార్థుల బలిదానాలతో నేటి తెలంగాణ కల సాకారమైంది. అలా తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించిన విద్యార్థి శ్రీకాంత్ చారి. ఆయన తెలంగాణ సాధన కోసం ప్రాణాలను విడిచినా ఆయన మరణించాక వచ్చిన తెలంగాణలో ఆయన మరణంకు పాలకులు ఎంత న్యాయం చేశారు, ఆయన స్మారకంగా చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి వంటి ప్రశ్నలకు ఆయన తల్లి శంకరమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కేటీఆర్ పిలిచినా పోయి కలవలేదు…
శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గారికి బిడ్డను కోల్పోయిన ఆ నష్టం ఎవరూ పుడ్చలేనిదని చెప్పి ఉద్యమం అయిపోయి తెలంగాణ ఏర్పడి, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గా టికెట్ ఇస్తామని ఇప్పటి కెసిఆర్ ప్రభుత్వం మాటిచ్చింది. అలాగే ట్యాంక్ బండ్ వద్ద శ్రీకాంత్ చారి విగ్రహం ఏర్పాటు, ఒక జిల్లాకు శ్రీకాంత్ చారి పేరు వంటి హామీలను కెసిఆర్ ప్రభుత్వం విస్మరించిన వేల శంకరమ్మ గారు ఈ ఎనిమిదేళ్లలో ఏమాత్రం పోరాడారు వంటి విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కేటీఆర్ పిలిచి ఎమ్మెల్సి ఇస్తానని చెప్పినట్లు తెలిపిన ఆమె నేను ప్రగతి భవన్ చుట్టూ ఏ మంత్రి చుట్టూ తీరగాలని అనుకోవడం లేదని ఆ అవసరం మాకు లేదంటూ చెప్పారు.
ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్బి నగర్ చౌరస్తా పేరును మార్చి తన కొడుకు పేరు పెడుతారని కూడా అనుకోలేదని అయితే పెట్టారని, మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక భర్తతో విబేధాలు, ఆయన కేఏ పాల్ పార్టీలో ఉన్న విషయం గురించి మాట్లాడుతూ తనకు తలకు దెబ్బ తగలడం వల్ల ఏం చేస్తున్నాడో తనకే తెలియదని అలాంటి సమయంలో పాల్ వాళ్ళ పార్టీ నుండి వచ్చి డబ్బు ఆశ చూపి ఏదేదో చేసారని, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడని ఫోన్ కూడా తనకు అందుబాటులో లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను కేఎ పాల్ పార్టీలో లేడని తెలిపారు శంకరమ్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…