టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన శ్రీరెడ్డి నటిగా ఎవరికీ పెద్దగా తెలియదు కానీ కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రం ఆమె పేరు బాగా వినిపించింది. అస్సలు మొహమాటం, సిగ్గు అనేది లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. అప్పుడే సంప్రదాయ చీరకట్టులో పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుంది.
ఏంటో.. ఈ శ్రీరెడ్డి! ఎవరికి అర్థం కాదనిపిస్తుంది. 2019లో “సుచీ లిక్స్” పేరుతో దక్షిణాది తారల వ్యక్తిగత విషయాలను గాయని సుచిత్ర బయటపెట్టినట్లే “శ్రీ లీక్స్” పేరుతో నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలనమైన కామెంట్స్ చేసి టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.! కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించడమే కాకుండా.. తనకు సినిమా ఛాన్స్ లు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. టాలీవుడ్ లో ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నానిలను టార్గెట్ చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేరు మారుమ్రోగిపోయేలా చేసింది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం శ్రీరెడ్డి చేస్తోందని కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరోపించింది.
అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్‌తో పాటు మంచు లక్ష్మీలపై కూడా తన దైన స్టైల్ లో ఫైర్ అయింది శ్రీరెడ్డి. “తాను కేవలం పబ్లిసీటీ కోసం మీడియా ముందుకు రావడం లేదని రకుల్ ప్రీత్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘రకుల్ ప్రీత్.. చెత్త చెత్తగా మాట్లాడవద్దు.. నిన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తారు.. కానీ కాస్టింగ్ కౌచ్ గురించి మేము మాట్లాడింది అబద్దమని పిచ్చి, పిచ్చి కామెంట్స్ చెయ్యకు.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే నీకు, మా లాంటి వాళ్ల బాధ ఏం తెలుసు.. అప్పట్లో నేను టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తోన్నపుడు నువ్వొచ్చి.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వంటివి గానీ, డ్రగ్స్ కానీ ఏమి లేవు. ఇక్కడ ఎవరు ఎవరినీ తిట్టరు అంటూ పెద్ద క్యాండిల్ ర్యాలీ చేసావుగా.. టాలీవుడ్ లో నీకు కోట్లు కుమ్మరిస్తుంటే పాపం.. నువ్వు టాలీవుడ్ గొప్పతనం గురించి చెప్పకపోతే ఏం చెప్తావులే.. జిమ్‌లు పెట్టి వ్యాపారం కూడా చేస్తున్నావు, ఇదంతా తెలుగు ప్రేక్షకుల డబ్బు.. అప్పనంగా తింటున్నావు.. ఇక్కడ సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూసే వందలాది మంది కార్మికులు ఉన్నారు.. గుర్తించుకో.! నీలాంటి వాళ్లను టాలీవుడ్ లో ఉంచకూడదనే మా ప్రయత్నం. ఎక్కువ మాట్లాడితే, తెలుగోళ్లం అందరం కలిసి నీ తాట తీస్తాం.. ఖబడ్దార్ బిడ్డా’ అంటూ హెచ్చరించింది.
ఇదే సందర్భంలో మరో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి మాట్లాడుతూ.. మంచు లక్ష్మి ఏమో.. మా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయా.? కాస్టింగ్ కౌచ్ ఉందా.? అందాల మేడలో ఉన్న మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? అంటూ గతంలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ను శ్రీ రెడ్డి గుర్తు చేసింది. ఈ రోజు డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు బయటకు వచ్చింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చెప్పిన రకుల్.. బాలీవుడ్‌లో మాత్రం అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉండకూడదంటూ చెప్పడం తన 2 నాల్కల ధోరణికి నిదర్శనం కాదా.? అలాగే డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు ఎలా బయటికి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు నా గురించి ఏదేదో చెత్త వాగుడు వాగిన రకుల్ అసలు రహస్యాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నాకేలాగో చెడ్డ పేరు వచ్చింది. ఎవరు చేసిన కర్మను వాళ్లు అనుభవించక తప్పదు అంటూ వేదాంతం వల్లించింది శ్రీ రెడ్డి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…