2012లో వైజాగ్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ANM నర్స్‌గా చేరిన కల్యాణిని, 2020లో డాక్టర్ నమ్రతా వైజాగ్ బ్రాంచ్ మేనేజర్‌గా నియమించారు. అప్పటి నుండి కల్యాణి, నమ్రతా చెప్పిన విధంగానే అన్ని మోసపూరిత కార్యకలాపాల్లో పాలుపంచుకుందని పోలీసులు గుర్తించారు. లావాదేవీలు, స్కానింగ్ రిపోర్టుల ఎడిటింగ్, తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపడం వంటి బాధ్యతలన్నీ కల్యాణే చూసుకున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన అనైతిక సరోగసీ మోసం కేసులో నిందితురాలు కల్యాణి అచ్చయ్యమ్మ పాత్రపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మేనేజర్‌గా పనిచేసిన కల్యాణి, మొత్తం అక్రమ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.
2012లో వైజాగ్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ANM నర్స్‌గా చేరిన కల్యాణిని, 2020లో డాక్టర్ నమ్రతా వైజాగ్ బ్రాంచ్ మేనేజర్‌గా నియమించారు. అప్పటి నుండి కల్యాణి, నమ్రతా చెప్పిన విధంగానే అన్ని మోసపూరిత కార్యకలాపాల్లో పాలుపంచుకుందని పోలీసులు గుర్తించారు. లావాదేవీలు, స్కానింగ్ రిపోర్టుల ఎడిటింగ్, తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపడం వంటి బాధ్యతలన్నీ కల్యాణే చూసుకున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అక్రమాల ద్వారా వచ్చిన లాభాలను కల్పనకు డాక్టర్ నమ్రతా షేర్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. కల్యాణికి బహుమతిగా భారీ విల్లా ఇచ్చి, వైజాగ్‌లోని Ocean View Apartment ను కూడా ఆమె వినియోగించుకుంటున్నట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కల్యాణి, నమ్రతా చేసే మోసాలకు పూర్తిగా సహకరించినట్లు తేలింది. దళారులు పంపిన స్కానింగ్ రిపోర్టులను ఎడిట్ చేసి, పిల్లలు లేని తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపిన విషయాన్ని కూడా పోలీసులు రిపోర్ట్‌లో ప్రస్తావించారు.
ఈ కేసులో రాజస్థాన్ దంపతులతో మొదటగా కలిసింది కల్యాణినే. జూన్ 5న పుట్టిన అస్సాం మహిళ శిశువును ఆమె రాజస్థాన్ దంపతులకు అప్పగించింది. ఈ లావాదేవీకి రూ. 2 లక్షలు చెల్లించారని రిపోర్ట్‌లో తెలిపారు. బాబుకు జాండిస్ ఉందని చెప్పి, వైజాగ్‌లోని లోటస్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని కల్యాణి సూచించినట్లు సమాచారం.
పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్షులను రిపోర్ట్‌లో జోడించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై సోదాల్లో రూ. 2.37 లక్షలు, వందల కేసు షీట్స్, పేషెంట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నవజాత శిశువుల కొనుగోలుకి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ను కూడా పోలీసులు గుర్తించారు.
మొత్తానికి, సరోగసి మోసం వ్యవహారంలో కల్యాణి అచ్చయ్యమ్మ ప్రధాన పాత్రదారి అని రిమాండ్ రిపోర్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…