SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకదీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు.ఒక సన్నివేశాన్ని ఈయన ఒక శిల్పంలా చెక్కుతారు కనుక రాజమౌళిని జక్కన్న అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇలా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన జక్కన్నకే చెల్లుతుంది.
ఇలా ఈయన సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం క్లుప్తంగా రావడం కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఖండాలను దాటి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం ఏంటో తెరపై మనకు కనపడుతుంది.ఇలా అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన రాజమౌళి గురించి తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తాజాగా నటి శ్రియ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎక్కువగా దుమ్ము ఉన్న ప్రదేశంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజమౌళి గారు ఒక్కసారిగా ఆస్తమాకు గురయ్యారని ఈమె తెలియజేశారు.
దుమ్ము కారణంగా ఆయన తీవ్రమైన ఆస్తమా సమస్యతో బాధపడినప్పటికీ ఏమాత్రం షూటింగ్ వాయిదా వేయకుండా షూటింగ్ పనులను ప్రారంభించారంటూ ఈ సందర్భంగా రాజమౌళి ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి ఈమె చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన పలువురు ఇదే కదా రాజమౌళికి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ అంటూ రాజమౌళి పై ప్రశంసల కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…