Ajith: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఇక అజిత్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయనకు ఏ మాత్రం విరామం దొరికిన బైక్ రైడింగ్ వెళుతూ ఉంటారు. అంతేకాకుండా తన ఆరోగ్యం పై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇలా ఎప్పటికప్పుడు జనరల్ చెకప్ చేయించుకొని అజిత్ ఇటీవల అపోలో హాస్పిటల్ కి వెళ్లి జనరల్ చెకప్ చేయించుకున్నారు అయితే ఈ చెకప్ లో భాగంగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అజిత్ బ్రెయిన్ లో చిన్న క్లాట్ ఉందని వెంటనే దానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్లో దాదాపు నాలుగు గంటల పాటు ఈయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని ఇలా సర్జరీ చేసిన అనంతరం వైద్యులు ట్యూమర్ తొలగించారని తెలుస్తోంది.
సర్జరీ విజయవంతం..
ఈ విధంగా ఈయన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా కోలుకొని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…