Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన జీవితంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు మహిళల గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇలా తను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మూల కారణం తన అమ్మ అని తెలిపారు తన అమ్మ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పిందని తెలిపారు.
ఇలా డాన్స్ నేర్చుకోవడం ఒక మంచి ఆర్ట్ అని తనలో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా నేను డాన్స్ రూపంలో తెలియజేస్తానని ఈయన తెలియజేశారు ఇలా నా జీవితంలో అమ్మ కీలక పాత్ర పోషించిందని ప్రతి ఒక్క విషయంలో తాను నన్ను ఎంతగానో ప్రోత్సహించేదని తెలిపారు. ఇక నా జీవితంలో నా భార్య ప్రణతి కూడా కీలకపాత్ర పోషించారని తెలిపారు.
తన ఇష్టాలను నాపై రుద్దదు..
నేను ఇలా హోమ్లి మెన్ గా ఉన్నాను అంటే అందుకు కారణం ప్రణతి అని తెలిపారు. ఆమె తన ఇష్ట ఇష్టాలను ఎప్పుడూ కూడా నాపై రుద్దదు అంతేకాకుండా ప్రతిరోజు నేను వ్యాయామం చేసేలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.ఇలా ప్రణతి కూడా నా విజయంలో భాగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…