Movie News

Star Actress: గుడి కట్టడానికి పర్మిషన్ అడిగిన అభిమాని .. మైండ్ బ్లోయింగ్ సమాధానం చెప్పిన నటి!

Star Actress: ప్రస్తుతం హీరోయిన్లకు గుడి కట్టడం ఒక ప్యాషన్ గా మారిపోయింది. ఇప్పటికే కుష్బూ ,హన్సిక వంటి కొందరు హీరోయిన్లకు వారి అభిమానులు గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఒక అభిమాని హీరోయిన్ సమంతకి కూడా గుడి కట్టించాడు. ఇదిలా ఉండగా మరొక అభిమాని హీరోయిన్ కి గుడి కట్టించడానికి ఆమె పర్మిషన్ అడిగారు… ఆ హీరోయిన్ ఇచ్చిన సమాధానంతో అభిమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డింపుల్ హయాతి. ప్రస్తుతం ఈ అమ్మడు హీరో గోపీచంద్ కి జంటగా రామబాణం సినిమాలో నటించింది. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మ్యచో హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో వీరిద్దరూ బిజీగా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, టీవీ షోలో సందడి చేస్తున్న వీరిద్దరూ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా గురించి ప్రశ్నలు అడుగున్న సమయంలో ఓ అభిమాని ” మేడం.. మీరు నాకు ఓ విషయంలో పరిమిషన్ ఇస్తారా ? అని డింపుల్ ని అడిగాడు. దీనికి ఏంటో చెప్పండి అని ఆమె అనడంతో మీకు నేను గుడి కట్టాలని అనుకుంటున్నా.. అది పాల రాయితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా? అని ఆమె ని ప్రశ్నించాడు.

Star Actress: బంగారంతో కట్టండి…


దీనికి డింపుల్ హయాతి సమాధానం ఇస్తూ.. ‘ నాకు బంగారంతో గుడి కట్టండి చాలా బాగుంటుంది అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హాయాతి నుండి ఇటువంటి సమాధానం ఎవరు ఊహించలేదు. అయితే ఆమె అలా అనటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం డింపుల్ చెప్పినటువంటి ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

19 minutes ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

20 minutes ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

25 minutes ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

38 minutes ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

47 minutes ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

52 minutes ago