Rangastalam Mahesh: రంగస్థలం, మహానటివంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించిన మహేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. మహేష్ ఇలా నటుడిగా మాత్రమే కాకుండా జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాకుండా యూట్యూబర్ గా కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడి పాత్ర వల్ల మహేష్ కి మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రికి అసిస్టెంట్గా నటించాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో తన తండ్రి చనిపోయిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. నితిన్ గారి ఆఫీస్ లో ఫోటో ఇచ్చి అలా బయటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో నాన్నగారు చనిపోయినట్లు ఫోన్ వస్తే ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో కన్నతండ్రి శవాన్ని స్మశానం వరకు తీసుకెళ్లి అంత్యక్రియల కోసం పుల్లలు తేవడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో కన్న తండ్రి దహనానికి కూడా డబ్బులేని పరిస్థితిలో ఉన్న నాకు ఎందుకురా ఈ జీవితం అనిపించింది.
ఆ సమయంలో నాకు దగ్గరైన వాళ్లు కూడా నన్ను తిట్టారు అంటూ మహేశ్ చెప్పుకొచ్చాడు. మనం ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు జీరో..కానీ ఇక్కడ కష్టపడి సంపాదించిన అంతా మన జీవితానికి ప్లస్ అవుతుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక సాధారణ మనిషిలా జీవించాలని అశ్విని దత్ గారు చెప్పారు. ఇప్పటికీ వారి ప్రొడక్షన్లో ఉన్న ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తారు అంటూ మహేష్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…