Keerthi Suresh: సాధారణంగా కొందరి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో మంది ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి దర్శకులలో మణిరత్నం ఒకరు. మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చే సినిమాలలో ఒక చిన్న పాత్రలో అయినా నటించాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. ఇలా అవకాశాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.
ఇలాంటి డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోవడం తెలివి తక్కువ పనే అని చెప్పాలి.
మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. విక్రమ్, ఐశ్వర్య రాయ్,త్రిష వంటి తదితరులు నటించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో త్రిష కంటే ముందుగా కీర్తి సురేష్ కి అవకాశం వచ్చిందని అయితే తనకు డేట్స్ అడ్జస్ట్ కాలేదన్న కారణంతో కీర్తి సురేష్ ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని వార్తలు వినపడుతున్నాయి. ఈ విధంగా కీర్తి సురేష్ మణిరత్నం గారి సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపించడంతో ఎంతోమంది నెటిజన్ లు కీర్తి సురేష్ చాలా తెలివి తక్కువ పనిచేసింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మణిరత్నం సినిమాని వదులుకున్న కీర్తి…
ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నారు. అదేవిధంగా రజనీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండటం వల్లే ఈ సినిమాకి నో చెప్పిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కీర్తి సురేష్ నో చెప్పడంతో ఆమె స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. ఇందులో త్రిష కుందనవై అనే రోల్ పోషించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…