Star Hero:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తుంటారు వెళ్తుంటారు. అయితే ఒక హీరో సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఆ చిత్ర బృందంతో ఎంతో చనువుగా ఉంటారు. అలాగే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఇకపోతే ఈ షూటింగ్ సమయంలో హీరోలు హీరోయిన్ల పట్ల కొందరు చాలా కేరింగ్ చూపిస్తే మరికొందరు తమకు ఏమీ పట్టనట్టు ఉంటారు.
ఇక ఈ మధ్యకాలంలో కొందరు ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు హీరోయిన్ల పట్ల కాస్త కేరింగ్ గానే ఉంటున్నారు. అయితే ఏ హీరో కూడా హీరోయిన్ కి సంబంధించిన వస్తువులను మోసుకు రావడం వంటివి చేయరు.కానీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విక్రమ్ మాత్రం ఏ హీరో చేయనటువంటి పనిని చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి విక్రమ్ నటి దీక్షా సేథ్ తో కలిసి వీడింతే అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఈ జోడికి మంచి ఆదరణ లభించింది. మామూలుగా విక్రమ్ తన లిమిట్స్ లో తాను ఉంటూ హీరోయిన్ల పట్ల కూడా ఎంతో కేరింగ్ తీసుకుంటారు. అయితే ఈ హీరోయిన్ విషయంలో మాత్రం విక్రమ్ చేసిన పనిని నటి తెలియచేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో మంచు కొండల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఆ చలికి తట్టుకోలేక హీరోయిన్ అక్కడి నుంచి లోపలికి పరుగులు పెట్టగా తన చెప్పులను అక్కడే వదిలి వెళ్లిపోయారట. అయితే తాను చెప్పులు మర్చిపోయిందని గ్రహించిన విక్రమ్ తన చెప్పులను స్వయంగా తన చేతులతో పట్టుకొని తీసుకువచ్చారని ఈమె చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.తాను ఇప్పటివరకు హీరోయిన్ల పట్ల ఇలాంటి కేరింగ్ తీసుకునే హీరోని ఇంతవరకు చూడలేదు అంటూ ఈమె హీరో పై ప్రశంసలు కురిపించారు. ఇలా విక్రమ్ ఏకంగా దీక్షాసేత్ చెప్పులు తీసుకురావడంతో అప్పట్లో ఈయనని ఒక్కమగాడు అంటూ కోలీవుడ్ అభిమానులు ఈయనపై ప్రశంసలు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…