Actress Sadha:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్ల జీవితం ఎప్పుడు ఎలా తారుమారవుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఇండస్ట్రీలో కొనసాగే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడాలు ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీసి వైవాహిక జీవితంలో సంతోషంగా కొందరు ఉండగా మరికొందరు మధ్యలోనే వారి రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే ఇలా ఇండస్ట్రీలో ఓ హీరోని నమ్మి వారి చేతిలో మోసపోయిన వారు ఎంతోమంది ఉంటారు.
ఇలా ఇండస్ట్రీలో మోసపోయిన కొందరి హీరోయిన్లు బహిరంగంగా ఈ విషయాలను బయటకు చెప్పగా మరికొందరు దాస్తూ ఉంటారు. అయితే నిజం నిప్పులాంటిది ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదు అంటారు అలా చాలా సంవత్సరాల తర్వాత సదా విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకున్నటువంటి సదా కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న సమయంలో ఆ హీరోతో ప్రేమలో పడి ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని తెలుస్తుంది.
ఈ విధంగా ప్రేమలో ఉండటం వల్ల ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ సినిమా కూడా బాగా హిట్ అయింది.అయితే ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వారి అందచందాలకు ఫిదా అయినటువంటి ఆ హీరో క్రమక్రమంగా సదాని దూరం పెడుతూ వచ్చారట. ఇదేంటి అని సదా ప్రశ్నించగా నిన్ను ఎప్పుడూ నేను ఆ ఉద్దేశంతో చూడలేదు యు ఆర్ మై సిస్టర్ అని సమాధానం చెప్పారని ఈమె వెల్లడించారు.ఇలా ఆ ఒక్క మాటతో తనని చంపేసాడని అప్పటికప్పుడు ఆ హీరోని చెప్పు తీసుకు కొట్టాలి అన్నంత కోపం వచ్చింది అంటూ సదా విషయంలో జరిగిన సంఘటన గురించి తాజాగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…