Childhood Pic: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల గురించి తెలుసుకోవాలంటే వారి కోసం ప్రత్యేకంగా మ్యాగజైన్స్ కొనాల్సి వచ్చేది. ఇలా వార పత్రికలో సినిమా సెలబ్రిటీల గురించి వారి ఫోటోలు వేస్తూ వార పత్రికలు అమ్మేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది అభిమానులు నేరుగా వారిన అభిమాన నటీనటులతో మాట్లాడుతున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీల సైతం వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే చైల్డ్ హుడ్ ఫోటో ట్రెండ్ నడుస్తోంది.ఈ క్రమంలోనే హీరోలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే అభిమానులు ఆ ఫోటోని వైరల్ చేస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో గుర్తించండి అంటూ పెద్ద ఎత్తున వారి చిన్నప్పటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్నటువంటి ఈ హీరో ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఈయన నటుడిగా విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక తెలుగులో కూడా ఇతనికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. మరి ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.
అదేనండి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటుడు విజయ్ సేతుపతి. మాస్టర్ సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఉప్పెన సినిమాతో తండ్రి పాత్రలో నటించి అభిమానులను సందడి చేశారు. ఈ ఫోటోలో ఉన్నది నటుడు విజయ్ సేతుపతి.ఈ విధంగా తమ అభిమాన నటుడు చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నేటిజెన్లు ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…