Sai priya : విశాఖపట్నం లో సంచలనం రేపిన సాయి ప్రియ మిస్సింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ప్రేమించినవాడితో లేచి పోయిన సాయి ప్రియ చివరకు ఆచూకీ లభించింది. తన భార్య ఏమైందో అని వెతికి ఆందోళన చెందిన భర్తను బాగానే మోసం చేసింది సాయి ప్రియ. ఇలాంటి ఘటనలు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మీడియా ముందుకు వచ్చిన సాయి ప్రియ తనకు తన భర్తతో ఉండటం ఇష్టం లేదని అతను ఇచ్చిన బంగారు గాజులు ఏం చేయలేదని ఇచ్చేస్తానని చెప్పి తన ప్రియుడితో జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఇక ప్రియుడు పవన్ కూడా జాబ్ చేస్తున్నా, తనని పోషించగలను బాగా చూసుకుంటా మమల్ని వదిలేయండి అంటూ చెప్పాడు.
సాయి ప్రియ పై దాడి చేస్తున్న జనం…
సాయి ప్రియ పెళ్లయ్యాక రెండేళ్లకు ప్రియుడితో పారిపోవడం ఆమె చేసిన పెద్ద తప్పు. ఇష్టం లేని పెళ్లికి బలవంతంగా తల్లి దండ్రులు చేసినప్పుడు మొదట్లోనే వ్యతిరేకించాల్సింది. అలా కాదని రెండేళ్ల తరువాత వెళ్లడం ఏంటి, అటు భర్త జీవితాన్ని నాశనం చేసింది. ఇక ఈ విషయంలో ఎవరు కూడా సాయి ప్రియకు మద్దతు ఇవ్వరు. నూటికి తొంభై మంది సాయి ప్రియదే తప్పని అంటారు. ఇక జనాలు మాటలతో కాకుల్లా పొడుస్తున్నారు. తప్పు చేసావని నిందిస్తున్నారు. దీంతో సాయిప్రియ నరకం చూస్తోంది. పెళ్లి చేసుకున్న భర్త, ఆమె కన్న తల్లి దండ్రులు, అత్తమామలు కూడా ఏదో ఒక సమయానికి క్షమించవచ్చేమో కాని జనాలు మాత్రం సాయిప్రియను వదలడం లేదు.
ఆమెను వెతకడం కోసం ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చుపెట్టిన విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. తప్పు చేసింది నిజమే కావచ్చు కానీ ఇంకా ఎన్నాళ్ళు ఆమెను నిందిస్తూ, వేదిస్తారు. నచ్చిన జీవితం కోసం ఇంత పని చేసిన సాయి ప్రియ ఇకనైనా ఆ నచ్చినట్టు జీవితంలో బాగుపడాలని కోరుకుని వదిలేస్తే బాగుంటుంది కదా. ఇంకా తనను నిందించి, తిట్టడం, దాడి చేయడం వల్ల ఒరిగేది ఏమి లేదు. అయితే ఇలాంటి ఘటనలు సమాజంలో వివాహ వ్యవస్థపై నమ్మకాన్ని పోగొడుతాయి అన్నది మాత్రం నిజం. నచ్చిన వ్యక్తితో జీవించాలని ఎవరైనా అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చొరవ చూపి తమ పిల్లల ఇష్టాయిష్టాలను గమనించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…