Star Hero: అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో.. ఏకంగా కాలివేళ్లు తొలగింపు?
Star Hero: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా, డి.ఎం.డి.కె అధ్యక్షుడుగా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయనను అమెరికా సింగపూర్ వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ వైద్య చికిత్సలు అందించారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. అయితే ఈయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ బాధ్యతలను విజయ్ కాంత్ భార్య ప్రేమలత పార్టీ వ్యవహారాలను తన చేతులలోకి తీసుకున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భావించి కుటుంబ సభ్యులు సంతోష పడగా తిరిగి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది.
ఈ క్రమంలోని ఈయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా షుగర్ వ్యాధితో విజయ్ కాంత్ బాధ పడటం తో ఈయన కుడి కాలి వేళ్ళకు రక్తం సరఫరా కాకపోవడం వల్ల అత్యవసర పరిస్థితులలో డాక్టర్లు కాళ్ల వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే వైద్యులు సర్జరీ చేసి తన కాలి 3 వేలను తొలగించారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో మరొక రెండు రోజులలో ఇతనిని డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు వెల్లడించారు.ఈ విధంగా నటుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఆయన ఆరోగ్యంపై స్పందించి నా ప్రియమిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…