ఈ మధ్యకాలంలో చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లలో మనకు ఏదో ఒక సందర్భంలో హీరోలు బైక్ రైడ్ లు చేస్తూ కనిపించడం సర్వసాధారణం అయిపోయింది.ఈ విధంగా హీరోలు తమ హీరోయిజం చూపించే విధంగానే ఖరీదైన, విభిన్నమైన బైకులను రూపొందిస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో మన హీరోలు ఉపయోగించిన విభిన్నమైన ద్విచక్ర వాహనాలు ఏమిటో చూద్దాం…
ఎన్టీఆర్, రామ్ చరణ్ – ఆర్ఆర్ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి గతంలో విడుదల చేసిన పోస్టర్లలో రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా ఎన్టీఆర్ ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రేక్షకులను సందడి చేశారు.అదే విధంగా తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ వెనక కూర్చోగా ఎన్టీఆర్ బైక్ నడుపుతున్న టువంటి సర్ప్రైజ్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ నడుపుతున్న బైక్ పేరు రెట్రో వెలోసెట్. ఆనాటి రోజులకు అద్దం పట్టేలా వెలోసెటో బ్రాండ్‌కు చెందిన ఈ వింటేజ్ వాహనాన్ని ఈ సినిమాలో ఉపయోగించారు.
పవన్ కళ్యాణ్ -అయ్యప్పనుమ్ కోషియుమ్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయాలను తెలుపుతూ అప్పట్లో ఒక స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ పై ఎంట్రీ ఇస్తున్నట్టు చూపించారు.
అల్లు అర్జున్ -పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరోగా తెరకెక్కబోతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ఉన్నటువంటి పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు.
బాలకృష్ణ -లెజెండ్: బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్ సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఈ సినిమాలో బాలకృష్ణ హార్లే డేవిడ్ సన్ బ్రాండ్‌కు చెందిన ఒక ద్విచక్రవాహనాన్ని నడిపారు. అప్పట్లో ఈ బండి బాగా పాపులర్ అయింది. ఈ విధంగా మరి కొందరు హీరోలు కూడా పలు సినిమాలలో ప్రత్యేకమైన బైక్ రైడ్ లు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…