Categories: FeaturedGeneral News

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎస్బీఐ నుంచి కొత్త సర్వీస్.. దీని ద్వారా ఎన్నో లాభాలు..

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. వడ్డీ రేటు, బ్యాంకులో పెట్టుబడులపై రాబడి విషయంలో, వినియోగదారులకు మేలు కలిగించే ఇతర స్కీమ్‌లు, అకౌంట్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ పేరుతో ఓ కొత్త సర్వీస్ అందిస్తోంది. ఈ స్కీమ్ కింద సాధారణ సేవింగ్స్ అకౌంట్లో కంటే అధిక వడ్డీ పొందవచ్చు. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ కస్టమర్లు సాధారణ 2.7 శాతం వార్షిక రాబడి కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.

ఈ అకౌంట్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ తో అనుసంధానమై ఉంటుంది. ఇది మీ అకౌంట్లోనే ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా మరో అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా MOD కింద ఈ టర్మ్ డిపాజిట్ ఓపెన్ చేయాలి. మన సేవింగ్ అకౌంట్లోనే ఈ నగదు సెట్ చేసిన పరిమితిని బట్టి ఆటోమాటిక్ గా MOD లోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీనిని ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి నగదు కట్ అవుతుంది.

ఒకవేళ మన టర్మ్ పూర్తికాకముందే అందులోని నగదును మళ్లీ విత్ డ్రా చేసుకోవచ్చు. మెయిన్ బ్యాలెన్స్ లేనప్పుడు ఎప్పడంటే అప్పుడు MOD అకౌంట్లో నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పటివరకూ మనం అందులో ఉంచిన కాలానికి మాత్రమే వడ్డీ పడుతుంది. దానిలో పరిమితి అమౌంట్ ను రూ. 35 వేలుగా సెట్ చేసుకోవాలి. కనీస మొత్తంలో రూ.10వేల వరకు ఒకేసారి MODగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. సాధారణ SBI సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే.. ఈ అకౌంట్ కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ను కూడా సాధారణ అకౌంట్ మాదిరిగానే అన్నీ సర్వీసుల్లోనూ వినియోగించుకోవచ్చు.

ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది. MODS అకౌంట్ పై కస్టమర్లు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంటులో గరిష్టంగా ఇంత బ్యాలెన్స్ ఉండాలనే లిమిట్ లేదు. నెలవారీ కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

2 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

2 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

2 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

2 hours ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

3 hours ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

3 hours ago