ఆగస్ట్ 21న భూమిక చావ్లా పుట్టిన భూమిక.. తన వయసు 40కి చేరువవుతున్నా ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తుంది. ‘ఖుషీ’ చిత్రంతో తెలుగు తెరపై సంచలనం సృష్టించింది అందాల భామ భూమిక చావ్లా. ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘వాసు’, ‘సింహాద్రి’ వంటి సినిమాల్లో నటించిన భూమిక వరుసగా సూపర్ హిట్ చిత్రాలలో లక్కీ హీరోయిన్ గా.. వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలిగింది. యోగా మాస్టర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకొని తల్లి అయిన భూమిక ఆ తర్వాత సినిమాలకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది భూమిక.
ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా ‘తేరే నామ్’ లాంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘తేరే నామ్’ చిత్రం బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. తెలుగులో ‘శేషు’ గా.. తమిళంలో ‘సేతు’ గా రీమేక్ అయింది. ఆ తర్వాత ‘M.S. ధోనీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది భూమిక చావ్లా. అయితే అదంతా గతం.. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. 40 ఏళ్లు పైబడిన భూమికకు ఇప్పటికీ సినిమా ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. అక్క, వదిన వంటి చక్కటి క్యారెక్టర్లతో ప్రేక్షకులను మెప్పిస్తునే వుంది. ‘MCA’, ‘సవ్యసాచి’, ‘యూటర్న్’ వంటి చిత్రాల్లో భూమిక నటించిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. సినిమాల్లో సక్సెస్ కావటం వేరు.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించడం వేరు. ఇక్కడ 2వ తరగతికి చెందిన హీరోయిన్ భూమిక. తను హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన తొలి చిత్రం ‘యువకుడు’ లో చందమామలాంటి అందంతో, తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.
‘యువకుడు’ చిత్రం పెద్దగా విజయవంతం కాకపోయినా భూమిక టాలీవుడ్ లో రాణించిందంటే అందుకు ఆమె అందం, నటనే ప్రధాన కారణమని చెప్పవచ్చు. భూమిక సినిమా కెరీర్ ను మలుపు తిప్పి.. ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ ను తీసుకొచ్చిన చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషి’. ఈ చిత్రం సృష్టించిన సంచలనం, తిరగ రాసిన రికార్డులు గురించి సోషల్ మీడియాలోని నెటిజన్లందరికీ తెలుసు. ఈ చిత్రం తర్వాత గ్రాండ్ సక్సెస్ తో భూమిక స్టార్ హీరోయిన్ గా మారిపోయి మహేశ్ ఒక్కడు, జూనియర్ NTR సింహాద్రి వంటి చిత్రాలు భూమిక కెరీర్లో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, టాలీవుడ్ కింగ్ నాగార్జునలతో కూడా భూమిక హీరోయిన్ గా నటించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…