Categories: FeaturedMovie News

మోహన్ బాబు, బాలయ్యల సీక్రెట్స్ ను లీక్ చేసేసిన రాజా రవీంద్ర !!

తెలుగు సినీ రంగంలో నటుడిగానే కాకుండా స్టార్ హీరోల మేనేజర్ గా కూడా రాజా రవీంద్ర చాలా బిజీగా ఉంటాడు. ఈమధ్య కాలంలో ఈయన డేట్స్ చూస్తున్న హీరోలెవరూ పెద్దగా విజయాలు సాధించకపోవడంతో రాజకీయాల్లోకి రావాలన్న ఆశతో జగన్ పార్టీలో చేరాడు రాజా రవీంద్ర. లేటెస్ట్ గా జగన్ ప్రభుత్వం పైనా, ఆయన పరిపాలన పైనా ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా జగన్‌ని ఓడించాలి అంటే మరో క్రొత్త నాయకుడు రావాలి తప్ప ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు లాంటి ఇతర నాయకుల వల్ల అది సాధ్యం కాదంటూ తేల్చి చెప్పేశాడు రాజా రవీంద్ర.

గతంలో ఓ Tv ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ త్వరలోనే TDP అధికారంలోకి వస్తుందని చెప్పడంతో బాలయ్య చేసిన కామెంట్స్ పై కూడా స్పందించాడు రాజా రవీంద్ర ”బాలయ్య ఈ కామెంట్స్ చేశారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎంతైనా ఆయన కూడా ఓ MLA కాబట్టి ఏ కారణం లేకుండా ఇలాంటి కామెంట్స్ చేయరు. ఖచ్చితంగా ఆయన కామెంట్స్ వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సినీ రంగంలో వుంటూ ఆయనతో చనువుగా తిరిగిన నేను బాలయ్యలో గమనించిందేమిటంటే.. బాలయ్య చిన్న పిల్లావాడి మనస్తత్వం గలవాడు. ఆయన మనసులో ఏమీ ఉండదు. కోపం వస్తే తిట్టేయడం.. ప్రేమ కలిగితే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడటం. ఈ రెండే ఆయనకి తెలుసు. ఆయనకు కోపం కూడా ఎక్కువగా రాదు. చాలా మంది బాలయ్యకు ముక్కు మీద కోపం ఎక్కువ అంటుంటారు.

కానీ., అలాంటివాళ్ళకు తెలియని విషయమేమిటంటే.. బాలయ్యకు ఎంత కోపమో.. ఆయన అంత శాంత స్వభావుడు కూడా. ఆయనకు కోపం వచ్చిందటే డైరెక్ట్ గా చూపించేస్తారు. ఆ కోపం వెనుక ఓ కారణం ఉంటుంది. అలాగే బాలయ్యకి పాట పాడాలనిపిస్తే పాడేస్తారు. అది నచ్చడం, నచ్చక పోవడం వినేవాళ్ల ఇష్టం. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. ఎవరైనా నచ్చకపోతే.. నువ్వు నాకు నచ్చలేదు.. ఇకపై నువ్వు నా ముందు కనిపించకు.. అని ముఖంపైనే చెప్పేస్తారు. అప్పుడు కూడా కనిపిస్తే 2 పీకుతారు కూడా.! వేరే వాళ్ల కోసం బాలయ్య దగ్గర తప్పుగా చెప్పినా.. “ఆ సంగతి నాకు తెలుసు నువ్వు పక్కకెళ్లు..” అంటారు.

బాలయ్యను చూసినట్లే.. మోహన్ బాబుని కూడా నేను బాగా దగ్గర్నుంచి చూశాను. మోహన్ బాబు కొడుకు విష్ణు బాబు డేట్స్ నేనే చూస్తాను కాబట్టి మోహన్ బాబు అంటే ఏంటో నాకు తెలుసు. కోపం వస్తే కొట్టేయడం మాత్రమే కాదు. దాని వెనుక చాలా ఓపిక ఉంటుంది. చాలా రకాలుగా భరించిన తర్వాతే ఆయన బరస్ట్ అవుతారు. సినిమా రంగంలో ఒక్కొక్కరి ఎమోషన్ ఒక్కోరకంగా ఉంటుంది.’ అంటూ మీడియా ముందుకొచ్చారు రాజా రవీంద్ర.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago