తెలుగు సినీ రంగంలో నటుడిగానే కాకుండా స్టార్ హీరోల మేనేజర్ గా కూడా రాజా రవీంద్ర చాలా బిజీగా ఉంటాడు. ఈమధ్య కాలంలో ఈయన డేట్స్ చూస్తున్న హీరోలెవరూ పెద్దగా విజయాలు సాధించకపోవడంతో రాజకీయాల్లోకి రావాలన్న ఆశతో జగన్ పార్టీలో చేరాడు రాజా రవీంద్ర. లేటెస్ట్ గా జగన్ ప్రభుత్వం పైనా, ఆయన పరిపాలన పైనా ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా జగన్‌ని ఓడించాలి అంటే మరో క్రొత్త నాయకుడు రావాలి తప్ప ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు లాంటి ఇతర నాయకుల వల్ల అది సాధ్యం కాదంటూ తేల్చి చెప్పేశాడు రాజా రవీంద్ర.

గతంలో ఓ Tv ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ త్వరలోనే TDP అధికారంలోకి వస్తుందని చెప్పడంతో బాలయ్య చేసిన కామెంట్స్ పై కూడా స్పందించాడు రాజా రవీంద్ర ”బాలయ్య ఈ కామెంట్స్ చేశారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎంతైనా ఆయన కూడా ఓ MLA కాబట్టి ఏ కారణం లేకుండా ఇలాంటి కామెంట్స్ చేయరు. ఖచ్చితంగా ఆయన కామెంట్స్ వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సినీ రంగంలో వుంటూ ఆయనతో చనువుగా తిరిగిన నేను బాలయ్యలో గమనించిందేమిటంటే.. బాలయ్య చిన్న పిల్లావాడి మనస్తత్వం గలవాడు. ఆయన మనసులో ఏమీ ఉండదు. కోపం వస్తే తిట్టేయడం.. ప్రేమ కలిగితే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడటం. ఈ రెండే ఆయనకి తెలుసు. ఆయనకు కోపం కూడా ఎక్కువగా రాదు. చాలా మంది బాలయ్యకు ముక్కు మీద కోపం ఎక్కువ అంటుంటారు.

కానీ., అలాంటివాళ్ళకు తెలియని విషయమేమిటంటే.. బాలయ్యకు ఎంత కోపమో.. ఆయన అంత శాంత స్వభావుడు కూడా. ఆయనకు కోపం వచ్చిందటే డైరెక్ట్ గా చూపించేస్తారు. ఆ కోపం వెనుక ఓ కారణం ఉంటుంది. అలాగే బాలయ్యకి పాట పాడాలనిపిస్తే పాడేస్తారు. అది నచ్చడం, నచ్చక పోవడం వినేవాళ్ల ఇష్టం. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. ఎవరైనా నచ్చకపోతే.. నువ్వు నాకు నచ్చలేదు.. ఇకపై నువ్వు నా ముందు కనిపించకు.. అని ముఖంపైనే చెప్పేస్తారు. అప్పుడు కూడా కనిపిస్తే 2 పీకుతారు కూడా.! వేరే వాళ్ల కోసం బాలయ్య దగ్గర తప్పుగా చెప్పినా.. “ఆ సంగతి నాకు తెలుసు నువ్వు పక్కకెళ్లు..” అంటారు.

బాలయ్యను చూసినట్లే.. మోహన్ బాబుని కూడా నేను బాగా దగ్గర్నుంచి చూశాను. మోహన్ బాబు కొడుకు విష్ణు బాబు డేట్స్ నేనే చూస్తాను కాబట్టి మోహన్ బాబు అంటే ఏంటో నాకు తెలుసు. కోపం వస్తే కొట్టేయడం మాత్రమే కాదు. దాని వెనుక చాలా ఓపిక ఉంటుంది. చాలా రకాలుగా భరించిన తర్వాతే ఆయన బరస్ట్ అవుతారు. సినిమా రంగంలో ఒక్కొక్కరి ఎమోషన్ ఒక్కోరకంగా ఉంటుంది.’ అంటూ మీడియా ముందుకొచ్చారు రాజా రవీంద్ర.