ఒకే స్టూడియోలో రెండు షూటింగ్ లు జరుగుతున్న సందర్భంలో దర్శకుడు రాఘవేంద్ర రావు గారు పక్క సెట్ లో ఉన్న డైరెక్టర్ శరత్ ను కలవడానికి వెళ్లారు. అక్కడ షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్ నగ్మా కనిపించారు. తాను తీయబోతున్న కొత్త సినిమాకు హీరోయిన్ గా న్యూ ఫేస్ అయితే బాగుంటుందని భావించి, ఆమె గురించి ఆరా తీయగా బొంబాయి హీరోయిన్ అని తెలిసింది. చిరంజీవి నటిస్తున్న ఘరానా మొగుడు సినిమాకి ఆ విధంగా బుక్ చేశారు. రెండవ హీరోయిన్ గా వాణి విశ్వనాథ్ ను ఎంపిక చేశారు.
జగదేకవీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు లాంటి హిట్ సినిమాల అనంతరం రాఘవేంద్ర రావు-చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఈ కాంబినేషన్ వస్తుందంటే భారీ అంచనా ఉంటుంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలంటే కన్నడంలో హిట్ అయిన “అనురాగ్ అరలిత్” సినిమా తెలుగులో ఘరానా మొగుడుగా రిమేక్ చేశారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథ అందివ్వనప్పటికి పదునైన మాటలు రాయడం మరో విశేషం.
నగ్మా తన కెరియర్ హిందీలో భాగి సినిమాతో ప్రారంభించింది.ఈ సినిమా లో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ తో జతకట్టింది. అలా హీరోయిన్ నగ్మా తెలుగులో కాట్రగడ్డ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో పెద్దింటి అల్లుడు తెలుగు సినిమాతో అడుగుపెట్టింది… ఆయితే ఘరానా మొగుడు పాట షూటింగ్ సందర్భంలో… హిందీలో ఇదివరకు లిప్ లాక్ సీన్ చేశారని అలాంటి సీన్ తెలుగులో చేయాలని రాఘవేంద్రరావు నగ్మాను అడగడంతో ముందుగా నో చెప్పిన తర్వాత ఘరానా మొగుడు చిత్రంలోని ఒక పాటకు లిప్ లాక్ లో నటించారు. కానీ ఎందుకో చిరంజీవి గారికి నచ్చకపోవడంతో చివరి నిమిషంలో ఘరానా మొగుడు సినిమాలోంచి ఘాటు ముద్దు ను తొలగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…