చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కూలీ (Koolie) సినిమా ట్రైలర్‌లో వినిపించిన “అలేలా పోలెమా” అనే పదానికి ఒక విచిత్రమైన కథ ఉందని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వెల్లడించారు. ఇటీవల ఓ ప్రమోషన్ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ మ్యూజికల్ ఫ్రేజ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
“కూలీ మూవీ ట్రైలర్ రెడీ చేస్తున్న సమయంలో, నేను స్టూడియోలో నాకు అనిపించిన కొన్ని రాండమ్ ట్యూన్స్ పాడుతుంటాను. అలాంటి సమయంలోనే ‘అలేలా పోలెమా… అలేలా పోలెమా… అల్లే!’ అని ఓ పదం వచ్చింది” అని అనిరుధ్ వివరించారు. ఈ పదం పూర్తిగా ఆ సమయంలో తన మనసుకు వచ్చిన ఒక ఆలోచన మాత్రమేనని ఆయన చెప్పారు. ఈ బీట్ గురించి దర్శకుడు లోకేష్‌కు చెప్పగా, అది విని ఆయనకు బాగా నచ్చిందని, ట్రైలర్‌లో అదే తనకు బెస్ట్ పార్ట్ అని లోకేష్ అన్నారని అనిరుధ్ తెలిపారు.
అయితే, ఈ పదం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ తర్వాత గూగుల్‌లో దీనికి సంబంధించిన అర్థం కోసం వెతికినప్పుడు, గ్రీకు భాషలో “నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను” అనే అర్థం వస్తుందని తెలిసిందట. ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగిందని, తనకు గ్రీకు భాష రాదని అనిరుధ్ నవ్వుతూ చెప్పారు.
ట్రైలర్లో వచ్చిన “అలేలా పోలెమా” బీట్‌కు మంచి స్పందన రావడంతో, మూవీ మ్యూజిక్ ఆల్బమ్‌లో దీనిని ‘MOBSTER’ పేరుతో ప్రత్యేక ట్రాక్‌గా జోడించారు. అనిరుధ్ రవిచందర్ భవిష్యత్ ప్రాజెక్టులలో శివకార్తికేయన్‌తో “మధరాసి”, “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)”, దళపతి విజయ్‌తో “జన నాయగన్” వంటి చిత్రాలు ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో ఓ చిన్నారి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చదువుకోవాలన్న తపన…
దేశంలో ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది. పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తరకం…
ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గది తీసుకున్న ఓ అతిథికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు…
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళ జీవితం, విదేశీ నేలపై అసాధారణమైన మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.…
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్…
తెలుగు బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభానికి ఇంకా అధికారిక తేదీ ప్రకటించకపోయినా, కంటెస్టెంట్ల జాబితాపై మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో…