మన భారతదేశంలోనే తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా చెప్పుకుంటారు. కానీ క్షేత్రస్తాయిలో చూస్తే మాత్రం అలా ఉండటం లేదు. ప్రజలకు ఒక సర్వెంట్ గా ఉండాల్సిన పోలీసు ఆఫీసర్ అతడి బూటుతో మొఖం తన్నాడు. తర్వాత తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతే కాకుండా అక్కడ ఈ వీడియోను తీస్తున్న అతడిని మందలించినట్లు సమాచారం. ప్రజల కోసమే తాము ఉంటున్నామని.. ప్రజలతో కలిసి పని చేస్తున్నామని చెప్పి.. ప్రజలనే ఇలా కాలితో తన్నుతూ మేము ఇలానే ఉంటామనేది.. ఈ ఘటన తెలియజేస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాలో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని రాజోలి ఎస్సై లెనిన్ బాబు కాలి బూటుతో తన్నాడు. రాజోలి మండల కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఓ మద్యం దుకాణం వద్దకు మద్యం బాబులు విపరీతంగా వస్తుంటారు.
అక్కడ ఈ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీలో భాగంగా కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అక్కడ మద్యం షాప్ వద్ద మద్యం సేవించడం పోలీసులు చూశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడాన్ని చూసిన పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అతడిని అందులో ఊదమని అడగ్గా.. ఊదలేదు. కనీసం దగ్గరకు రాలేదని ఎస్సై తెలిపాడు. అయితే కోపంతో అతడిని బూటుతో మొఖంపై తన్ని.. అసభ్యకర పదజాలంతో దూషించాడు.
ఆ బూటుతో తన్నడంతోనే అక్కడే పడిపోయాడు. దీనిపై వివరణ కోరగా.. తమతో అతడు గొడవ పడ్డాడని.. తమ వెహికల్‌పై రాళ్లతో దాడిచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ లో సదరు పోలీసుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…