Featured

Subbaraya Sharma : జంధ్యాలను పరిచయం చేసింది నేనే… ఆయన పెద్ధ డైరెక్టర్ అయ్యాక నాతో ఎలా ఉండేవాడంటే…: నటుడు సుబ్బరాయ శర్మ

Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

జంధ్యాల నాకు జూనియర్…

సుబ్బరాయ శర్మ గారు కాలేజీ లో చదివే సమయంలో జంధ్యాల గారు ఆయనకు జూనియర్. అలా నాటకాలను వేసే సమయలో సుబ్బరాయ శర్మ గారి డైరెక్షన్లో నాటకం వేసే సమయంలో జంధ్యాల గారికి మొదట అవకాశం ఇచ్చారట. అలా నాటక రంగ ప్రవేశం చేయించింది సుబ్బరాయ శర్మ గారే. అయితే సినిమాలలో జంధ్యాల గారి డైరెక్షన్లో ఎన్నో సినిమాలలో నటించారు సుబ్బారాయశర్మ.

జంధ్యాల గారు రచయితగా మొదలు పెట్టి సినిమా డైరెక్టర్ గా మంచి హిట్స్ అందుకున్నాక ఒకసారి ‘విచిత్ర ప్రేమ’ అనే సినిమా ప్రెస్ మీట్ లో అందరికీ నేను మొదట సుబ్బరాయ శర్మ గారి డైరెక్షన్లో నటించాను ఇప్పుడు ఆయన నా డైరెక్షన్లో నటిస్తున్నారంటూ పెద్ధ దర్శకుడు అయ్యాక చెప్పాడు జంధ్యాల. ఆరోజు చాలా సంతోషంగా అనిపించింది అంటూ సుబ్బరాయ శర్మ జంధ్యాల గారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

16 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

16 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

16 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

17 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

17 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

17 hours ago