Chandhra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ‘ధర్మ చక్రం’ వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999లో శ్రీకాంత్ తో తీసిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత శ్రీహరి గారితో ఒక్కడే, అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది వంటి సినిమాలతో హిట్ కొట్టాడు.
సురేష్ బాబు ని నమ్మితే హ్యాండ్ ఇచ్చాడు…
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో తొలి నుండి అనుబంధం ఉన్న చంద్ర మహేష్ మొదటి సరి డైరెక్టర్ గా తీసిన ప్రేయసి రావే సినిమా హిట్ తరువాత వరుస ఆఫర్స్ అందుకున్నా సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ తో సినిమా తీయాలని అనుకున్నారట. సురేష్ బాబు కథ రెడీ చేసుకోమనడంతో చిరంజీవి గారే పిలిచి ఆఫర్ ఇచ్చినా మొదట నమ్మిన సంస్థకు చేస్తానని చెప్పి ఆ తరవాత మీతో సినిమా చేస్తానని చెప్పారట. ఇక హీరో వెంకటేష్ కోసం కొన్ని సినిమాలను రిఫరెన్స్ గా సురేష్ బాబు ఇచ్చి వీటన్నిటితో ఒక కథ రెడీ చెయ్ అని చెప్పారట. ఇక చంద్ర మహేష్ వాటితో కథను పోసాని గారితో కూర్చొని రెడీ చేస్తుండగా ఒకసారి సెకండ్ హాఫ్ నచ్చితే మరోసారి ఫస్ట్ హాఫ్ నచ్చిందని చెప్పడంతోనే అలా నెలలు గడిచాయి సినిమా ముందుకు పోలేదు. చివరకు నేను సినిమా చేయాల్సిన టైములో ఎన్ శంకర్ డైరెక్షన్ లో జయం మనదేరా సినిమాను చేసారు.
ఆ పైన వెంకటేష్ గారు ఎంత బిజీనో నాకు తెలుసు, అలా నాకు సురేష్ బాబు హ్యాండ్ ఇచ్చారు. ఇక నాకు ముందు ఆఫర్స్ ఇచ్చిన హీరోలందరి దగ్గరికి వెళ్లగా అందరూ నువ్వు రెండు నెలలు ముందు వచ్చుంటే బాగుండేది అని చెప్పడంతో గ్యాప్ వచ్చింది. చిరంజీవి గారిని వెళ్లి కలవగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని కొద్ది రోజులు ఆగాలని చెప్పారట. ఆ టైంలో శ్రీహరి గారు ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దాం అన్నారు. దాంతో ఆయనతో అయోధ్య రామయ్య సినిమా చేశాను అది సూపర్ హిట్ అయింది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…