Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయనకు ఎన్నో అవార్డులు, ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
బాహుబలి నుండి అందుకే బయటికి వచ్చాను…
జంధ్యాల గారితో చదువుకునే రోజుల నుండే పరిచయం ఉండటం వల్ల సినిమాలో జంధ్యాల గారి వల్లే వచ్చారు. ఇక ఎస్వి కృష్ణ రెడ్డి గారి దర్శకత్వంలో ‘శుభలగ్నం’ సినిమాతో మొదలై దాదాపు వరుసగా చాలా సినిమాల్లో చేసారు. అయితే చాలా కాలం అటు ఉద్యోగం చేసుకుంటూనే ఇటు ఈ నాలుగు రంగాల్లోనూ ఏదో ఒక నాటిక లేకపోతే సినిమా లేకపోతే సీరియల్ లో నటిస్తూ వచ్చారు. అయితే బాహుబలి సినిమా సమయంలో ఆ సినిమాలో మంత్రి పాత్ర చేసినపుడు రమ్యకృష్ణ ను రాణిగా అంగీకరించే సన్నివేశం వరకు నటించి మూడు రోజుల షూటింగ్ తరువాత తప్పుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. దీనికి కారణం సుబ్బరాయ శర్మ గారి భార్య జ్ఞానప్రసూనాంబ గారి ఆరోగ్యం సరిగా లేకపోవడం. అలాగే పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల భార్యను చూసుకోవాల్సిన బాధ్యత ఉండటం వల్ల తప్పుకున్నారట శర్మ గారు.
ఇక ఆ తరువాత కూడా అన్నింటికీ బ్రేక్ ఇచ్చి ఆమెను చూసుకున్నా ఆమె కోలుకోలేదు. ఆవిడ మరణించాక ఒంటరితనం బాగా ఇబ్బంది పెట్టి మళ్ళి ఏదోక పని లో బిజీ అవ్వాలని మళ్ళీ రేడియో, నాటక రంగాలతో తో పాటు బుల్లితెర, వెండితెర మీద కూడా మళ్ళీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మొదట్లో అవకాశాలు వచ్చినపుడు మేనేజర్ ను పెట్టుకుని నిర్మాతలకు, డైరెక్టర్లకు అందుబాటులో ఉండాలనే విషయం తెలియక చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…